నీటి నిల్వలతోనే సంపద సృష్టి సాధ్యం: వసంత
NTR: నీటి నిల్వలతోనే సంపద సృష్టి సాధ్యం అని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు. మైలవరం మండలం చంద్రాల గ్రామంలో "నీటి భద్రత-సాగునీటి సంఘాల బాధ్యత' కార్యక్రమంలో ఎమ్మెల్యే మంగళవారం పాల్గొన్నారు. నీటి భద్రత కార్యక్రమ ప్రచార పత్రాలు ఆవిష్కరించారు. దీనికి సంబంధించిన యాప్‌ను అందరూ డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు.