గంజాయి జోలికెళితే కఠిన చర్యలు: ఎస్పీ

గంజాయి జోలికెళితే కఠిన చర్యలు: ఎస్పీ

GNTR: గుంటూరు జిల్లాను గంజాయి రహితంగా మార్చడమే తమ లక్ష్యమని శనివారం ఎస్పీ వకూల్ జిందాల్ తెలిపారు. గంజాయి విక్రయించినా, సేవించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గడిచిన 2 రోజుల్లో 3.5 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని, 22 మందిని అరెస్టు చేశామన్నారు. ఈగల్ టీమ్‌తో సమన్వయం చేసుకుంటూ గంజాయి దందాకు అడ్డుకట్ట వేస్తామని చెప్పారు.