అన్నదాత సుఖీభవ ప్రచారం విజయవంతం
BPT: చుండూరు మండలం మండూరు గ్రామంలో ‘అన్నదాత సుఖీభవ – ఇంటింటికి ప్రచారం’ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నక్కా ఆనంద బాబు పాల్గొని రైతులకు పథకం వివరాలు తెలియజేశారు. అర్హులైన రైతులకు సంవత్సరానికి రూ. 20,000 మూడు విడతలుగా నేరుగా ఖాతాల్లో జమ అవుతుందని తెలిపారు.