గ్రామంలో తీరిన నీటి సమస్య

గ్రామంలో తీరిన నీటి  సమస్య

SDPT: బెజ్జంకి మండలం కల్లేపల్లి గ్రామంలో అంబేద్కర్ విగ్రహం వద్ద, ఎల్లమ్మ గుడి ప్రాంతాల్లో నెలకొన్న నీటి సమస్యకు గ్రామ పంచాయతీ పరిష్కారం చూపింది. రెండు కొత్త బోర్ మోటర్లను ఏర్పాటు చేసి సర్పంచ్ బిగుల్లా మోహన్, ఉపసర్పంచ్ శేషి వినీత్ ప్రారంభించారు. కార్యదర్శి రాకేష్, సభ్యులు పాల్గొన్నారు. స్థానికులకు తాగునీటి ఇబ్బందులు తగ్గనున్నాయని గ్రామస్తులు తెలిపారు.