స్నేహితుడికి ఆర్థిక సహాయం
BHNG: వలిగొండ మండల కేంద్రంలోని ప్రగతి పాఠశాలలో 2003-04 సంవత్సరంలో తమతో పాటు పదవ తరగతి చదువుకున్న స్నేహితుడు కొనితాల శ్రీధర్‌కు ప్రమాదవశాత్తు కాలు విరగడంతో అతని స్నేహితులు శనివారం సాయంత్రం రూ.16,200 ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భవిష్యత్తులో ఎటువంటి అవసరం ఉన్న స్నేహితులను మర్చిపోవద్దని వారన్నారు.