నిలకడగా సోనియా ఆరోగ్యం
కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సోనియా ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు ఢిల్లీలోని గంగారాం ఆసుపత్రి వైద్యులు తెలిపారు. కొంతకాలంగా కాంగ్రెస్ అగ్రనాయకురాలు ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నారు. తాజాగా ఆమె శ్వాస తీసుకోవడంతో ఇబ్బందిపడడతో వెంటనే సోనియాను ఆసుపత్రికి తరలించారు.