క్రిస్మస్ వేడుకలకు సిద్ధమైన చర్చిలు
నారాయణపేట జిల్లా కేంద్రంలోని యాదగిరి రోడ్డు సమీపంలో ఉన్న ఎం.బి చర్చిలో రేపు జరగనున్న క్రిస్మస్ వేడుకలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మునిసిపాలిటీ సిబ్బంది చర్చి పరిసర ప్రాంతాలను శుభ్రపరచి, వేడుకలకు ఎలాంటి ఆటంకం కలగకుండా చర్యలు తీసుకున్నారు. చర్చి మొత్తం విద్యుత్ కాంతులతో సుందరంగా అలంకరించబడి క్రిస్మస్ శోభను సంతరించుకుంది.