గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న.. మాజీ ZP ఛైర్పర్సన్

BHPL: భూపాలపల్లి మున్సిపల్ మాజీ కౌన్సిలర్ జక్కం రవి నూతన గృహప్రవేశ కార్యక్రమం బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ZP ఛైర్పర్సన్, BRS జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి హాజరై, వారికి నూతన వస్త్రాలను బహూకరించి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కటకం జనార్దన్, నూనె రాజు, హరిబాబు, గురిజాల శ్రీను తదితరులు ఉన్నారు.