బంగారు ఆభరణాలు చోరీ.. కేసు నమోదు
ELR: టి. నరసాపురం మండలం ఏపీగుంటకు చెందిన సత్యనారాయణ ఈనెల 10న భార్యతో కలిసి జంగారెడ్డిగూడెం బందువుల గృహ ప్రవేశం పంక్షన్‌కి వెళ్లారు. తిరిగి 11న ఇంటికి వచ్చి చూడగా ఇంటి తాళం పగుల గొట్టి ఉంది. ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువాలో ఉన్న రూ.70 వేల వెండి, బంగారు ఆభరణాలు దొంగతనానికి గురయ్యాయన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు HC రాజు ఆదివారం తెలిపారు.