స్కూల్ బస్సును ఢీ కొట్టిన లారీ... తప్పిన పెనుప్రమాదం

MHBD: పట్టణంలో మంగళవారం ఉదయం ఫ్లై ఓవర్ వద్ద స్కూల్ బస్సును లారీ ఢీకొట్టింది. ఘటన సమయంలో బస్సు వేగం తక్కువగా ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పింది. పిల్లలకు ఎటువంటి గాయాలు కాకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. మరో బస్సును తెప్పించి విద్యార్థులను పాఠశాలకు పంపించారు. ఈ ఘటనలో బస్సు స్వల్పంగా దెబ్బతింది.