నేడు సంక్షేమ పథకాల రుణాలకు ఇంటర్వ్యూలు
KNR: గన్నేరువరం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో షెడ్యూల్డ్ కులాల సంక్షేమ పథకాల రుణాల మంజూరుకు ఇవాళ ఉ.11 గంటలకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. అర్హులైన అభ్యర్థులు నిర్ణీత సమయానికి కార్యాలయానికి హాజరుకావాలన్నారు. లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, నిబంధనల ప్రకారం పారదర్శకంగా ఎంపిక ప్రక్రియ జరుగుతుందన్నారు.