అదనపు ఎస్పీని కలిసిన CI, SIలు
MDK: మెదక్ జిల్లా అదనపు ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన విక్రాంత్ కుమార్ సింగ్‌ను తూప్రాన్ పోలీస్ సర్కిల్ అధికారులు మర్యాదపూర్వకంగా కలిశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి బదిలీపై విచ్చేసిన విక్రాంత్ కుమార్ సింగ్ ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. ఈ క్రమంలో తూప్రాన్ సీఐ రంగకృష్ణ, ఎస్సై గంగరాజు, మనోహరాబాద్ ఎస్సై సుభాష్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు.