VIDEO: సర్పంచి తండాలో పూరిగుడిసె దగ్ధం
NZB: సిరికొండ మండలం సర్పంచి తండాలో మెగావత్ సరోజ, తార్య నివాసం ఉండే పూరి గుడిసె శుక్రవారం ఉదయం ప్రమాదవశాత్తు అగ్నికి ఆహుతైంది. ఈ ఘటనలో సుమారు రూ. 1.50 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు ఎస్సై నాగన్న తెలిపారు. నిత్యవసర వస్తువులు, దుస్తులు, వంట సామాగ్రి, డబ్బులు కాలిపోయాయని బాధితులు వాపోయారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.