వైభవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం

వైభవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం

ప్రకాశం: చంద్రశేఖరపురం మండలంలోని శీలం వారి పల్లి గ్రామంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి జన్మనక్షత్రం శ్రవణా నక్షత్రం సందర్భంగా శనివారం స్వామి వారి కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. భక్తులు స్వామివారి కల్యాణంలో పాల్గొని, పూజలు చేశారు. భక్తులకు ఆశీర్వచనాలను అందజేసిన వేద పండితులు స్వామివారి తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు.