పోగొట్టుకున్న ఫోన్ అందజేత

KNR: పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ను CEIR టెక్నాలజీ ద్వారా కనుక్కొని బాధితునికి అందించినట్లు కరీంనగర్ రూరల్ సీఐ నిరంజన్ రెడ్డి తెలిపారు. ఈనెల 9న పెద్దపల్లికి చెందిన లెక్కల ప్రశాంత్ మొబైల్ ఫోన్ను రూరల్ మండలం ఇరుకుల్ల వద్ద పోగొట్టుకున్నానని ఫిర్యాదు చేశాడు. CEIR టెక్నాలజీ ద్వారా జగిత్యాలలో ఉన్నట్లు కనుక్కొని ఫోన్ యజమాని ప్రశాంత్‌కు అందించారు.