ఉత్తమ ఉపాధ్యాయురాలిని అభినందించిన ఎమ్మెల్సీ
E.G: రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికైన మోటూరి మంగారాణిని ఎమ్మెల్సీ సోము వీర్రాజు అభినందించారు. రాజమండ్రిలోని తన కార్యాలయంలోఇవాళ ఆమెను శాలువాతో సత్కరించారు. అమరావతిలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఆమె అవార్డు అందుకోవడం సంతోషకరమన్నారు. పిల్లల్లో సృజనాత్మకతను పెంపొందించేలా విద్యను బోధిస్తున్నారని ఆయన ప్రశంసించారు.