కడపలో రహదారి భద్రతపై అవగాహన

కడపలో రహదారి భద్రతపై అవగాహన

కడప ట్రాఫిక్ సీఐ డీకే జావీద్ ఆధ్వర్యంలో ఓ ప్రైవేట్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో రహదారి భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ జావీద్ విద్యార్థులకు రోడ్డు దాటే నియమాలు వివరించి, లైసెన్స్ వచ్చేంత వరకు వాహనాలు నడపబోమని ప్రతిజ్ఞ చేయించారు. ట్రాఫిక్ నియమాలు పాటించాలని విద్యార్థులకు సీఐ జావీద్ సూచనలు చేశారు.