ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి: ఎస్పీ

BHPL: ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని ఎస్పీ కిరణ్ ఖరే అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజా దివాస్ కార్యక్రమంలో భాగంగా ఎస్పీ వివిధ మండలాల నుంచి వచ్చిన బాధితుల నుంచి 16 ఫిర్యాదులు స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫిర్యాదుదారుల సమస్యలను ఓపికతో విని పరిష్కరించాలన్నారు.