VIDEO: బండి ఆత్మకూరులో అంజన్నకు పూజలు
NDL: బండి ఆత్మకూరు మండలంలోని పెద్ద దేవలాపురంలోని శ్రీ ఏకశిలా అభయాంజనేయస్వామి వారి దేవాలయంలో స్వామివారికి చైత్రమాస శనివారం విశేష పూజలు చేశారు. ఆలయ ప్రధానార్చకులు స్వామివారికి పంచామృతాలతో అభిషేకం, తమలపాకులు, సింధూరంతో అలంకరించారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.