నివాసాల మధ్య యమపాశంలా విద్యుత్ డీపీ

నివాసాల మధ్య యమపాశంలా విద్యుత్ డీపీ

MDK: రామాయంపేట మండల కేంద్రంలో నివాస గృహాల మధ్య ఉన్న డబుల్ పోల్ డీపీ ప్రమాదకరంగా మారింది. డీపీ వద్ద మురికినీరు నిలిచి, చెట్లు,పొదలు విద్యుత్ తీగలను చుట్టేయడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని స్థానికులు వణుకుతున్నారు. చిన్నారులు ఆడుకునే ప్రదేశం కావడంతో పెను ప్రమాదం పొంచి ఉంది. అధికారులు స్పందించి పొదలను తొలగించి, ప్రమాదం జరగకముందే రక్షణ చర్యలు చేపట్టాలని కోరారు.