విద్యార్థులతో కలిసి భోజనం చేసిన మంత్రి

విద్యార్థులతో కలిసి భోజనం చేసిన మంత్రి

VZM: జామి మండలం లొట్లపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో ఎంతో ఆప్యాయంగా మమేకమై, వారి చదువుల పురోగతి గురించి ఆరా తీశారు. ఉన్నత లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగాలన్నారు. మంత్రి విద్యార్థులతో కలిసి నేలపైనే కూర్చుని భోజనం చేయడం అక్కడి వారిని విశేషంగా ఆకట్టుకుంది.