ఉచిత బియ్యం పంపిణీ గడువు రేపటితో ముగింపు

CTR: ఈనెల 1 నుంచి ప్రారంభమైన ఉచిత బియ్యం పంపిణీ గడువు శుక్రవారంతో ముగియనుంది. 5,34,721 రేషన్‌కార్డులకు బదులు బుధవారం వరకు 88.73 శాతం అనగా 4,74,412 కార్డుదారులకు ఉచిత బియ్యం, నగదుకు అరకిలో పంచదార పంపిణీ చేసింది. పోర్టబిలిటీ ద్వారా 92,453 కార్డుదారులకు నిత్యావసర సరుకులు అందజేశారు.