క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలి: మంత్రి

క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలి: మంత్రి

NDL: ఆత్మకూరు మండలం బైర్లూటిలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాద ఘటనపై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శ్రీశైలం వెళ్లొస్తూ ఆదోనికి చెందిన నలుగురు మృతి చెందడం బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని మంత్రి బీసీ జిల్లా అధికారులను ఆదేశించారు.