ఈనెల 16న కలెక్టరేట్ వద్ద జీడి మామిడి రైతుల నిరసన
విజయనగరం జిల్లా కలెక్టరేట్ వద్ద ఈనెల 16న జీడి మామిడి రైతులతో నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు జిల్లా రైతు సంఘం అధ్యక్షులు బీ రాంబాబు తెలిపారు. శనివారం గజపతినగరంలో ఆయన మాట్లాడుతూ.. ఉచిత పంటల బీమా ప్రభుత్వమే అమలు చేయాలని, 2024 -25 బీమా పరిహారం వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు నిరసన గోడ పత్రికను విడుదల చేశారు.