తుఫాన్ ప్రాంతాల్లో పర్యటించిన ప్రత్యేక అధికారి

తుఫాన్ ప్రాంతాల్లో పర్యటించిన ప్రత్యేక అధికారి

VZM: జిల్లా తుఫాన్ ప్రత్యేక అధికారి రవి సుభాష్ లోతట్టు ప్రాంతాలను జాయింట్ కలెక్టర్ సేధు మాధవన్‌తో కలసి మంగళవారం పర్యటించారు. తుఫాన్ పై తీసుకొంటున్న చర్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆనంతరం గుర్ల మండలంలో పర్యటించి, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఎటువంటి ప్రాణ నష్టం జరగకూడదన్నారు. పర్యటనలో మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.