పిడుగు పడి గేదె మృతి

W.G: వీరవాసరం మండలం తలదాటితిప్పలో భారీ వర్షం బీభత్సం సృష్టించింది. గ్రామంలోని గుడాల కోట సత్యనారాయణ గేదెపై పిడుగు పడి అక్కడికక్కడే మృతి చెందింది. మృతి చెందిన గేదె సుమారు రూ.1,50,000 విలువ ఉంటుందని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరాడు. వర్షానికి లోతట్టు ప్రాంతాలన్ని జలమయం అయ్యాయి.