VIDEO: పోలింగ్ కేంద్రానికి బారులు తీరిన జనాలు
ADB: తాంసి మండలంలో రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ ఆదివారం ఉదయం ప్రశాంతంగా ప్రారంభమైంది. కప్పర్ల గ్రామానికి చెందిన ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఉత్సాహంగా బారులు తీరారు. పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఓటర్లను పోలీసులు తనిఖీ చేసి లోనికి అనుమతిస్తున్నారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.