మరకత శివాలయంలో సీఎం వదిన
RR: శంకర్పల్లి మండలంలోని చందిప్ప గ్రామంలో ఉన్న 11వ శతాబ్దం బ్రహ్మసూత్ర మరకత శివాలయాన్ని సీఎం రేవంత్ రెడ్డి వదిన మంజుల సందర్శించారు. ఈ సందర్భంగా స్వామివారికి అభిషేకం, ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ.. స్వామివారిని దర్శించుకోవడం సంతోషాన్ని కలిగించిందని అన్నారు. ఆలయ కమిటీ సభ్యులు ఆమెకు స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు.