హైడ్రా రంగనాథ్‌పై హైకోర్టు సీరియస్

హైడ్రా రంగనాథ్‌పై హైకోర్టు సీరియస్

HYD: హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను బతుకమ్మకుంట భూమి వ్యవహారంలో కోర్టు ధిక్కరణ కేసులో హైకోర్టు దోషిగా ప్రకటించింది. స్టేటస్ కో ఆదేశాలు ఉన్నప్పటికీ వివాదాస్పద భూమిని ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ నిర్మాణాలు చేపట్టడంపై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 4 వారాల్లో అన్ని నిర్మాణాలు తొలగించి, పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.