కల్లు దుకాణాలపై ఎక్సైజ్ అధికారుల దాడులు

GDWL: గద్వాల మండలం మదనపల్లి, చెనిగోనిపల్లి గ్రామాల్లో లైసెన్స్ లేకుండా నడుస్తున్న కల్లు దుకాణాలపై ఎక్సైజ్ సిబ్బంది ఆదివారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల సందర్భంగా 210 లీటర్ల కల్లు నాశనం చేశారు. అనుమతులు లేకుండా కల్లు అమ్ముతున్న ఈడిగ పద్మ, తెలుగు రాములు, తెలుగు నాగన్నలపై రెండు కేసులు నమోదు చేసినట్టు ఎక్సైజ్ సీఐ గణపతి రెడ్డి తెలిపారు.