విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి

TPT: నాయుడుపేట పట్టణం మహాలక్ష్మి నగర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. తెలుగుదేశం పార్టీ సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి షామియాన సిద్ధం చేస్తూ విద్యుత్ షాక్‌కు గురై మునీశ్వర్ అనే వ్యక్తి మృతిచెందాడు. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యంతోనే ఘటన చోటుచేసుకుందని స్థానికులు ఆరోపించారు. ప్రమాద భరితంగా ఉన్న విద్యుత్ లైన్‌లను మార్పు చేయాలని కోరిన పట్టించుకోలేదన్నారు.