వైభవంగా కోదండరాముని తెప్పోత్సవం
TPT: తిరుపతి శ్రీకోదండరామస్వామి తెప్పోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీరామచంద్ర పుష్కరిణిలో విద్యుద్దీపాలతో సర్వాంగసుందరంగా అలంకరించిన తెప్పపై శ్రీసీతారామలక్ష్మణులు ఆశీనులై ఐదు చుట్లు తిరిగి భక్తులను కటాక్షించారు. భక్తులు కర్పూర నీరాజనాలు సమర్పించారు.