మహిళా రిజర్వేషన్లకు విపక్షాలు అనుకూలం: శ్రీనివాసరావు
BPT: మహిళా రిజర్వేషన్లకు విపక్షాలు వ్యతిరేకం కాదని సమాజ్ వాదీ పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరావు అన్నారు. ఉన్న స్థానాల్లోనే దీనిని అమలు చేయాలన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. బిల్లులో బీసీ కోటా ఉండాలని అఖిలేష్ డిమాండ్ చేస్తున్నారన్నారు. డీలిమిటేషన్‌తో దక్షిణాదికి తీవ్ర నష్టమని, దీనిపై ఇండియా కూటమిని ఏకం చేయడంలో అఖిలేష్ పాత్ర ఎంతో కీలకమని ఆయన తెలిపారు.