ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
KMM: తిరుమలాయపాలెం మండలం జూపెడ గ్రామంలో మంగళవారం ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వ్యవసాయ శాఖ అధికారులు ప్రారంభించారు. రైతులు దళారులను నమ్మి మోసపోకుండా, ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కేంద్రాలలోనే తమ ధాన్యాన్ని విక్రయింయచాలన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సరైన మద్దతు ధరను పొందాలని అధికారులు సూచించారు.