వరద బాధితులకు రూ.70 వేల సాయం

వరద బాధితులకు రూ.70 వేల సాయం

W.G: విజయవాడ వరద బాధితులు సహాయార్థం గూడూరు మండలం చెన్నూరులోని నేత కార్మికులు రూ.70వేల ఆర్థికసాయం అందించారు. రూ.50 వేలను చెక్కు రూపంలో, మరో రూ.20 వేలతో చీరలను కొనుగోలు చేసి ఎమ్మెల్యే సునీల్ కుమార్‌కు టీడీపీ మహిళా నాయకురాలు శ్రావణి రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారిని అభినందించారు.