రేపు వ్యవసాయ మార్కెట్ బంద్

MHBD: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ రేపు బంద్ ఉంటుందని మంగళవారం అధికారులు తెలిపారు. మిర్చి, పత్తి, మొక్కలు, వడ్లు, ధాన్యం పెద్ద మొత్తంలో నిల్వ ఉండటంతో స్థలం కొరత వల్ల రైతులు ఇబ్బందులు పడతారని, ఈ కారణంగా మార్కెట్ బంద్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. రైతులు ఈ విషయాన్ని గమనించాలని మార్కెట్ అధికారులు సూచించారు.