కలెక్టర్ కార్యాలయం ఎదుట సీపీఐ నిరసన
అన్నమయ్య: జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సీపీఐ ఆధ్వర్యంలో రాయచోటి నియోజకవర్గానికి చెందిన పేదలు భారీగా నిరసన చేపట్టారు. అర్హులైన కుటుంబాలకు తక్షణమే నివాస స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్‌కు వినతిపత్రం సమర్పించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని, సంవత్సరాలుగా ఇళ్ల కోసం ఎదురుచూస్తున్న పేదల సమస్యలను పరిష్కరించాలని కోరారు.