కొత్తూరు ఎడ్ల పోటీలు గెలిస్తే రూ. 40వేల బహుమతి

NDL: పాణ్యం మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొత్తూరులో ఉగాది పర్వదినం సందర్భంగా ఈనెల 31న ఒంగోలు జాతి ఎద్దులు బల ప్రదర్శన పోటీలు నిర్వహిస్తున్నట్లు ఉత్సవ కమిటీ సభ్యులు శిరసాని సుబ్బారెడ్డి తెలిపారు. మొదటి బహుమతి రూ.40,000 రెండో బహుమతి రూ.30,000 మూడో బహుమతి రూ.20,000 లుగా ఇస్తామని తెలిపారు. ఉగాది సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకుని ఎడ్ల పందాలను తిలకించారు.