దెబ్బతిన్న దోబీ ఘాట్‌ను పరిశీలించిన ఎమ్మెల్యే

CTR: పులివెందుల నియోజకవర్గంలోని ఎరవల్లిలో జెడ్పీటీసీ ఉపఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి పర్యటించి, దెబ్బతిన్న దోబీ ఘాట్‌ను స్థానికులతో కలిసి పరిశీలించారు. వర్షాలు, పాడైన సదుపాయాల వల్ల ధోబీలకు ఎదురవుతున్న ఇబ్బందులను విని, మరమ్మతులు, నీటి సరఫరా, షెడ్ నిర్మాణం త్వరితగతిన చేపడతామని హామీ ఇచ్చారు. త్వరలో సమస్య పరిష్కారానికి అధికారులతో చర్చించనున్నారు.