ట్యాంకర్ల ద్వారా త్రాగునీటి సరఫరా

ట్యాంకర్ల ద్వారా త్రాగునీటి సరఫరా

SKLM: పాతపట్నం మండలంలో గల కోదూరు గ్రామ పంచాయతిలోని ప్రహరాజా పాలెం ప్రజలకు తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడటంతో పార్టీ నాయకుల ద్వారా విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే మామిడి గోవిందరావు స్పందించి గురువారం మామిడి అప్పారావు మెమోరియల్ ట్రస్ట్ ద్వారా మంచినీటి ట్యాంకర్‌ను పంపించి తాగునీటిని సరఫరా చేయించారు. స్థానికులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.