కార్యకర్తలతో సమావేశం నిర్వహించిన మంత్రి
కృష్ణా: మచిలీపట్నం టీడీపీ కార్యాలయంలో ముఖ్య నేతలు, కార్యకర్తలతో మంత్రి కొల్లు రవీంద్ర శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలు, పార్టీ బలోపేతం వంటి అంశాలపై కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకున్నారు. తాజా రాజకీయ పరిణామాల గురించి చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజలకు ఎల్లవేళల అందుబాటులో ఉండాలని సూచించారు.