ఎరువుల దుకాణాలలో తనిఖీలు

ఎరువుల దుకాణాలలో తనిఖీలు

KDP: ముద్దనూరు పట్టణంలోని ఎరువులు, పురుగు మందుల దుకాణాలలో పొద్దుటూరు ఏడీఏ అనిత, ఏవో వెంకట కృష్ణారెడ్డి సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీలర్ల స్టాక్ రిజిస్టర్లను పరిశీలించి, గోడౌన్లో నిల్వ వివరాలను సరిచూశారు. ఎరువుల బస్తాల తుకాన్ని మిషన్ ద్వారా పరిశీలించారు. అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు ఫిర్యాదులు వస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.