ఎచ్చెర్లలలో ప్రమాదకరంగా సర్వీసు రోడ్డు

ఎచ్చెర్లలలో ప్రమాదకరంగా సర్వీసు రోడ్డు

SKLM: ఎచ్చెర్లలలో జాతీయ రహదారి 16 పక్కనే ఉన్న సర్వీస్ రోడ్డును కల్లాలుగా మార్చేశారు. రైతులకు కల్లాలు లేకపోవడంతో రోడ్డునే కల్లాలుగా మార్చి నూర్పులు నూరుస్తున్నారు. దీంతో ద్విచక్ర వాహనాలు తరచూ స్లిప్ అవుతూ ప్రమాదాలకు గురవుతున్నాయని వాహనదారులు అంటున్నారు. రైతులకు ప్రత్యేక కల్లాలని ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.