రహదారి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే
కోనసీమ: కొత్తపేట(మం) వాడపాలెం రహదారి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం ఆయన రహదారి పనులను పరిశీలించారు. రహదారి పనుల్లో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని అధికారులకు సూచించారు. రహదారిని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు.