అగ్నిప్రమాద తీవ్రతకు పాలిస్టరైనే కారణమా..?
హాంకాంగ్ అగ్నిప్రమాదంలో 44 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాద తీవ్రత భారీగా ఉండటానికి పాలిస్టరైనే కారణమని దర్యాప్తు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. భవనాల కిటికీల వద్ద పాలిస్టరైన్ బోర్డులు ఉన్నట్లు గుర్తించారు. ఈ మేరకు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఈ ప్రమాదంలో దాదాపు 300 మంది గల్లంతయ్యారు.