ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీల్లో న్యూ టెక్నాలజీ

ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీల్లో  న్యూ టెక్నాలజీ

HYDలో IICT శాస్త్రవేత్తలు ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీల్లో భద్రతను పెంచే దిశగా ముందడుగు వేశారు. సంప్రదాయ ఎలక్ట్రోలైట్లకు బదులుగా సాలిడ్ కాంపోజిట్ పాలిమర్ ఎలక్ట్రోలైట్ మ్యాట్రిక్స్‌ను అభివృద్ధి చేశారు. ఈ కొత్త సాంకేతికతతో బ్యాటరీలు మరింత సురక్షితంగా మారడమే కాకుండా, ఖర్చు తగ్గి, మన్నిక కూడా పెరుగుతుందని తెలిపారు. త్వరలోనే ఇవి మార్కెట్లోకి రానున్నాయి.