రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

VSP: గాజువాక సమీపంలోని శ్రీనగర్ వద్ద రోడ్డు ప్రమాదం జరగడంతో ఓ మహిళ మృతి చెందింది. సోమవారం సాయంత్రం శ్రీహరిపురం ప్రాంతానికి చెందిన గురుబిల్లి శాంతమ్మను లారీ ఢీకొంది. దీంతో ఆమె అక్కడికక్కడే కిందపడి మృతి చెందారు. గాజువాక ట్రాఫిక్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.