షాద్‌నగర్: ‘అధికార పార్టీకి బీఆర్ఎస్ షాక్ ఇచ్చింది’

షాద్‌నగర్: ‘అధికార పార్టీకి బీఆర్ఎస్ షాక్ ఇచ్చింది’

RR: గ్రామపంచాయతీ ఎన్నికల్లో షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ నాయకత్వంలో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు విజయకేతనం ఎగరేశారు. ఈ సందర్భంగా ఆయన వారిని అభినందించి మాట్లాడుతూ.. 153 గ్రామపంచాయతీ స్థానాలకు 65 స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించడం సంతోషకరమన్నారు. అధికార పార్టీకి బీఆర్ఎస్ గెలుపు గట్టి షాక్ ఇచ్చిందని పేర్కొన్నారు.