నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం
ELR: ఏలూరు మండలం పెదపాడు ప్రాంతాల్లో నిర్వహణ పనుల నిమిత్తం కొన్ని గ్రామాలకు బుధవారం విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఈఈ అంబేద్కర్ తెలిపారు. గుడివాకలంక, ప్రత్తికోళ్లలంక, పైడిచింతపాడు, కొక్కిరా యిలంక, మొండికోడు, కోమటిలంక, పెదయాగనమిల్లి గ్రామాలకు ఉదయం 9 గంటల నుంచి 12:30 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని వెల్లడించారు.