బీఆర్ఎస్ పార్టీలోకి భారీ చేరికలు
BHNG: రామన్నపేట మండలం బోగారం గ్రామానికి చెందిన నూతన సర్పంచ్ కూనూరు సాయి కుమార్ గౌడ్‌తో పాటు సుమారు 300 మంది కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు BRSలో చేరారు. ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతు లభించకపోవడంతో సాయి కుమార్ గౌడ్ BRSలో చేరి భారీ మెజార్టీతో సర్పంచిగా విజయం సాధించారు. మాజీ MLA చిరుమర్తి లింగయ్య సమక్షంలో పార్టీలో చేరారు.